calender_icon.png 29 July, 2025 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో 49 పూర్తిగా రద్దు చేయాల్సిందే

29-07-2025 01:13:30 AM

  1. తుడుం దెబ్బ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా

మద్దతు పలికిన ఎమ్మెల్యే హరీష్‌బాబు

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై28( విజయ క్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఏర్పాటుకు తీసుకువచ్చిన జీవో 49ను పూర్తిగా రద్దు చేయాలని  డిమాండ్ చేస్తూ ఇచ్చిన మహా ధర్నా పిలుపునకు జిల్లాలోని ఆదివాసీలు తరలివచ్చారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, జడ్పీ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ నాగేశ్వరరావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, సిపిఎం పార్టీ నాయకులు  దినకర్, శ్రీనివాస్ మద్ద తు పలికారు.

తుడుం దెబ్బ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు నగేష్, కోట్నాక విజయ్ మాట్లాడుతూ.. జిల్లాలోని 339 గ్రామాల ప్రజలను వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు.ప్రభుత్వం కేవలం జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేసిందని దానిని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.రాజకీయ నాయకులకు, పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే జీవోను రద్దు చేయించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు.

జీవో రద్దు జరిగితేనే ఆదివాసీల అస్తిత్వానికి మనుగడ ఉంటుందని పేర్కొన్నారు.ఆదివాసి చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు వివరిస్తున్నాయని ఆరోపించారు.జీవో రద్దు కాకుంటే రాజీనామాలు చేస్తామని ఎమ్మెల్యేలు ప్రకటించడం కాదని తమను రాజీనామాలు చేయమని ఏ రోజు కూడా మేము డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు.భవిష్యత్ తరాల జీవనం కోసం జీవో పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే హరీష్ బాబు మాట్లాడుతూ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిపాదనలు పంపించిందని తెలిపారు.జీవో 49 కేంద్రం పరి ధిలో ఉందని ఇన్నాళ్లు మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేసి జిల్లా ప్రజలను మరోసారి మోసం చేసిందని విమర్శించారు.ఫారెస్ట్ కన్జర్వేషన్ రిజర్వ్ కు వ్యతిరేకంగా ఢిల్లీలోనూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్ర మంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు.