13 July, 2026 | 5:19 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

ప్రజలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలి

26-06-2025 07:10 PM

నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్...

కరీంనగర్ (విజయక్రాంతి): పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేదించాలని నగరపాలక సంస్థ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్(Commissioner Praful Desai) అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం రోజు నగరంలో అధికారులతో కలిసి కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ పర్యటించారు. నగర సుంధరీకరణలో భాగంగా ప్రధాన రహాదారులలో డివైడర్స్ & మీడియమ్స్ తో పాటు నగరంలోని బస్టాండ్, తెలంగాణ చౌక్, ఐబీ గెస్ట్ హౌజ్, కోర్ట్, మంచిర్యాల్ చౌరస్తా, బొమ్మకల్ తదితర హైలాండ్ జంక్షన్లను తనిఖీ చేసి పరిశీలించారు. హైలాండ్ జంక్షన్లు మీడియమ్స్ లలో కార్మీకులతో చెత్తను తొలగించి వేయడంతో పాటు కూడళ్ళ రేలింగ్ చుట్టు ఉన్న ఫ్లెక్సీలను తొలగించి వేశారు.

ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ... కరీంనగర్ నగరపాలక సంస్థలో 100 రోజుల ప్రణాళిక కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. నగర సుంధరీకరణ లో భాగంగా నగరంలోని డివైడర్స్ మీడియమ్స్ తో పాటు హైలాండ్ జంక్షన్ల లో కార్మీకులు చెత్తను శుభ్రం చేయాలన్నారు. నగరపాలక సంస్థ ద్వారా ప్లాస్టిక్ నివారణ చర్యలో భాగంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి... ప్లాస్టిక్ వాడే వ్యాపారులకు జరిమానా విధిస్తామని తెలిపారు. నగర ప్రజలకు సమయానికి అనుగుణంగా ఇంజనీరింగ్ అధికారులు మంచి నీటిని సరఫరా చేయాలని... త్రాగు నీటి విషయంలో ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ వేణు మాధవ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ స్వామీ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.