15 June, 2026 | 7:04 PM

Breaking News

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •  

కరెంట్‌షాక్‌తో వ్యక్తి మృతి

21-10-2024 12:05 AM

సూర్యాపేట, అక్టోబర్ 20: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం ఖాసింపేట గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన పందుల జానకిరాములు(50) అదే గ్రామానికి చెందిన మద్ది శ్రీనివాస్ అనే రైతు పొలంలో రసాయన మందు పిచికారి చేసేందుకు శ్రీనివాస్, లింగయ్యలతో కలిసి వెళ్లాడు.

మందు పిచికారి చేస్తున్న క్రమంలో పొలంలో తెగిపడిన విద్యుత్ తీగపై కాలు వేయడంతో షాక్‌కు గురై మృతిచెందాడు. విద్యుత్ తీగలు తెగిపడినప్పటికీ నిర్లక్ష్యం వహించిన ఏఈ, లైన్‌మెన్‌లపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుమారుడు శివ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.