4 March, 2026 | 11:58 AM

కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ కి పదవి గండం

04-03-2026 10:53 AM

కోర్టు మెట్లు ఎక్కిన కాంగ్రెస్ అభ్యర్థి రంగ మాధవి

మూడు ఓట్లతో గెలిచిన చైర్ పర్సన్ ఉమారాణి పై విచారణ 

కామారెడ్డి చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి పదవి గండంపై కలకలం

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి(Kamareddy Municipal Chairman Ippa Umarani) మున్సిపల్ కౌన్సిలర్  ఎన్నిక చెల్లదంటూ  వారి రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేసిన రంగ మాధవి బుధవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీ 38 వార్డులోంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి రాష్ట్ర ఎన్నికల  నియమావళి కి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో  ఎన్నికయ్యారని వారి రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో(Kamareddy District Court) కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ద్వారా దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా ప్రధాన  న్యాయమూర్తి  సిహెచ్ వి వి ఆర్ ప్రసాద్   విచారణకు స్వీకరించారు. 

దీంతో మున్సిపల్ చైర్ పర్సన్(Municipal Chairperson)గా ఇప్ప ఉమారాణి  కౌన్సిలర్ ఎన్నిక విషయంలో తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే మున్సిపల్ చైర్మన్ గా  ఎన్నికైన ఉమారాణి  శ్రీనివాస్ కి పదవి గండం ఏర్పడ నుం ది.మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి పై కామారెడ్డి ప్రథమ శ్రేణి కోర్టులో  కేసును స్వీకరించడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి పదవి గండంపై హాట్ టాపిక్ గా మారింది. స్థానికంగా ఉండని వారి ఓట్లు రాయించి దొంగ ఓట్లు వేయించినట్లు పూర్తి సాక్షాదారాలతో కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తుంది. ఓటు హక్కు కామరెడ్డిలో వినియోగించుకున్న వారు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సైతం ఆయా గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

దీంతో వారు వేసిన ఓట్లు చెల్లితాయా చెల్లవా అనే సందిగ్గం నెలకొంది. రాజంపేట గ్రామానికి చెందిన పలువురు దొంగ ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకొని కామారెడ్డి పట్టణంలో స్థానికంగా ఉండకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సర్పంచ్ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయించుకున్నట్లు సాక్షాలు ఉండడంతో మూడు ఓట్లతో ఓటమిపాలైన కాంగ్రెస్ అభ్యర్థి రంగ మాధవి కామారెడ్డిలో ప్రథమ శ్రేణి కోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ అభ్యర్థి రంగ మాధవి అభ్యర్థనను తమ శ్రేణి న్యాయమూర్తి  స్వీకరించి విచారణకు ఆదేశించి నట్లు సమాచారం. కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి పదవి గండం విషయం కామారెడ్డిలో హాట్ టాపిక్ గా మారింది.