నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు
29-06-2026 07:21 PM
ఏఎంసీ వైస్ చైర్మన్ పవన్ కుమార్
నంగునూరు,(విజయక్రాంతి): ప్రభుత్వం సూచించిన సన్న రకం వడ్ల విత్తనాలనే రైతులకు అందించాలని, నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఏఎంసీ వైస్ చైర్మన్ పవన్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని విత్తన,ఎరువుల దుకాణాలను ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విత్తనాల నిల్వలు,ధరల జాబితా, గడువు తేదీలను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చూడాలని వ్యాపారులకు ఆయన సూచించారు. ఎంఆర్పీ కంటే అధిక ధరలు వసూలు చేయరాదని,ప్రతి రైతుకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని స్పష్టం చేశారు.






