28 August, 2026 | 2:04 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

ఓటరు జాబితా ప్రజాస్వామ్యానికి పునాది

29-06-2026 07:43 PM

బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం ముత్తన్నపేట గ్రామంలోని పోలింగ్ స్టేషన్ నెం. 238 పరిధిలో  కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్నట్లు తహసీల్దార్ శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రజాస్వామ్యానికి పునాది. ప్రతి అర్హుడైన ఓటరు తన పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలి. అవసరమైతే కొత్తగా నమోదు, పేరు, చిరునామా, ఇతర వివరాల సవరణ కోసం ఎన్యూమరేటర్లు అందజేస్తున్న ఫారాలను సక్రమంగా నింపి అందించాలి.

ప్రజలు ఎన్నికల సిబ్బందికి పూర్తి సహకారం అందించి ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి" అని కోరారు. ముత్తన్నపేట గ్రామంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తూ అవసరమైన ఫారాలను పంపిణీ చేస్తున్నారు. ప్రజలు ఎలాంటి సందేహాలు ఉన్నా ఎన్నికల సిబ్బందిని సంప్రదించాలని తహసీల్దార్ సూచించారు.