5 May, 2026 | 1:59 AM

ప్రభుత్వ భూములు కాపాడాలంటూ వినతి

05-05-2026 12:00 AM

హైడ్రా ప్రజావాణికి 56 ఫిర్యాదులు

సికింద్రాబాద్ మే04 (విజయక్రాంతి): ప్రభుత్వ భూములు కాపాడాలంటూ హైడ్రా ప్రజావాణికి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూమికి సంబంధించి గజం స్థలం కబ్జా అవుతున్నా నగర ప్రజలు ఊరుకోడంలేదు. గతంలో మనకెందుకులే అనుకునేవా ళ్లమని.. ఇప్పుడు హైడ్రాకు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటారనే నమ్మకంతో తామంతా వచ్చి ఫిర్యాదు చేస్తున్నామని పలువురు సోమవారం హైడ్రా ప్రజావాణిలో తెలిపారు. ప్రభుత్వ భూములను పరి రక్షించడంలో హైడ్రా చూపుతున్న చొరవను చూసి తాము ఫిర్యాదు చేస్తున్నామన్నారు.

కబ్జాదారులు ఎంతటివారైనా వదిలిపెట్టకుండా ఆక్రమణలు తొలగించడాన్ని అభి నందిస్తూనే మా ప్రాంతాల్లో కూడా చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కులు, నా లాల ఆక్రమణలకు గురౌతున్నాయని.. వాటి ని కాపాడాలని పలువురు హైడ్రాను విజ్ఞప్తి చేశారు.  సోమవారం హైడ్రా ప్రజావాణికి మొత్తం 56 ఫిర్యాదులందాయి. వీటిని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు పరిశీలించారు. వెంటనే చర్యలు తీసుకుని పరిష్కరించాలని సంబంధిత అధికారులను కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు..