5 May, 2026 | 1:59 AM

ఇంటి నిర్మాణ అనుమతికి రూ.5 లక్షలు డిమాండ్

05-05-2026 12:00 AM

వలపన్ని జీహెచ్‌ఎంసీ జూనియర్ అసిస్టెంట్‌ను పట్టుకున్న ఏసీబీ

జూబ్లీహిల్స్,మే 4(విజయక్రాంతి): ఒక ఇంటి నిర్మాణ అనుమతి కోసం లంచం డిమాండ్ చేసిన ఓ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ సోమవారం వెల్లడించారు.వారు తెలిపిన వివరాల ప్రకారం బోరబండకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణాన్ని తలపెట్టాడు.అందుకు అనుమతులు కోరుతూ జిహెచ్‌ఎంసీ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.

అయితే అనుమతులను జారీ చేయడానికి రూ.5 లక్షల లంచం ఇవ్వాలని జిహెచ్‌ఎంసీ జూనియర్ అసిస్టెంట్ శ్రీలత సదరు నిర్మాణదారు డిని డిమాండ్ చేశారు.దీంతో సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించి తన ఫిర్యాదును నమోదు చేశారు.అతని ఫిర్యాదు మేరకు వలపన్నిన ఏసీబీ అధికారులు యూ సుఫ్ గూడలోని రత్నదీప్ వద్ద ఒప్పందంలో భాగంగా రూ.లక్ష లంచం తీసుకుం టుండ గా జూనియర్ అసిస్టెంట్‌ను పట్టుకున్నారు. అంతేకాకుండా సదరు అధికారి ఇం ట్లో కూడా దర్యాప్తును చేపట్టారు. ఈ వ్యవహారంలో ఇంకెవరి ప్రమేయం ఉందా అనే అంశాన్ని విచారిస్తున్నామని డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ తెలిపారు.