15 April, 2026 | 6:19 AM

మా ఓట్లు... మా వార్డుకు మార్చాలి

03-01-2026 09:57 PM

కమిషనర్ రమేష్ కు వినతిపత్రం

సుల్తానాబాద్,(విజయక్రాంతి): మా ఓట్లు మా వార్డుకు మార్చాలంటూ శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ రమేష్ కు మూడో వార్డుకు చెందిన పలువురు  కాలనీవాసులు వినతిపత్రం ఇచ్చారు. గత 30 సంవత్సరాలు గా తాము మూడవ వార్డులో ఉంటున్నామని గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లో మేము మా వార్డులోనే ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది అన్నారు. ప్రస్తుతం  కొంతమందికి సంబంధించి మూడవ వార్డు ఓట్లు వేరే వార్డు లో కి వచ్చాయని వారన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని  మా ఓట్లు మా వార్డుకే మార్చాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ కు వినతిపత్రం అందజేసి వేడుకున్నారు.