03-01-2026 09:58:49 PM
-నిరుపేదలకు దుప్పట్లు, సోలార్ లైట్లు పంపిణీ
-ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షులు కోటి
వెంకటాపూర్,(విజయక్రాంతి): నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షులు మామిడిశెట్టి కోటి అన్నారు. మండలంలోని తొర్రిచింతలపాడు గొత్తికోయగూడెంలో శనివారం మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనలతో యూత్ ఫర్ సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షులు మామిడిశెట్టి కోటి హాజరై గొత్తికోయగూడెం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు, సోలార్ లైట్లు, పౌష్టికాహార వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి ఐలయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు చెన్నోజు శ్రీనివాస్, ఉపసర్పంచ్ అన్నబోయిన రాజు, వార్డ్ మెంబర్ బానోత్ సునీల్, మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు ఎస్‌కే జాకీర్, ఆత్మ కమిటీ డైరెక్టర్ కాగిత రవి, నాయకులు బిక్షపతి, యుగేందర్, చేరాలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.