పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలి
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
ముకరంపుర, మే 19 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ పై పెంచిన రేట్లు తగ్గించాలని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ పై పెంచిన రేట్లు తగ్గించాలని దీని వల్ల రవాణా ఖర్చులు పెరిగి నిత్యవసర వస్తువులపై భారం పడుతుందని దీనివల్ల సామాన్య ప్రజానీకానికి ఏమీ కొనలేని పరిస్థితి ఏర్పడుతుందని, అంబానీ ఆదానీ లకు దోచి పెట్టడమే తప్ప మోడీ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయలేదని ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. 8 మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.
కానీ మన రాష్ట్రంలో అధిక అప్పులు ఉన్న కూడ ప్రజలకు ఎలాంటి భారం పడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మాదే అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. కావున ఇప్పటికైనా పునః పరిశీలించి పెంచిన డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించాలని తెలియజేశారు.
అలాగే నీట్ పరీక్ష పత్రం లీక్ అవడంతో విద్యార్థిని విద్యార్థులు గందరగోళానికి లోనవుతున్నారని మళ్లీ పరీక్ష రాయాలంటే ఫలితాలు ఏ విధంగా వస్తా యో అని అయోమయంలో ఉన్నారని నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ని మీ అ సమర్థత కు నిదర్శనమని పేర్కొన్నారు. మోదీ తెలంగాణకు వచ్చి ప్రజలను బంగారం కొన వద్దని పిలుపు ని య్యడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, బుచ్చిరెడ్డి, నరసింహం తదితరులు పాల్గొన్నారు






