Anti-Paper Leak Bill debate: కేంద్రంపై రాహుల్ తీవ్ర విమర్శలు
మూర్ఖులు ఎవరి మాటలు వినరని.. విద్యార్థులు నాతో చెప్పారు
విద్య వ్యాపారంగా మారితే విద్యార్థుల పరిస్థితి ఏంటి?
న్యూఢిల్లీ: వరసగా వాయిదా పడుతూ వస్తున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Parliament Monsoon Session) మళ్లీ ప్రారంభం అయ్యాయి. పేపర్ లీక్ వ్యతిరేక బిల్లుపై లోక్ సభలో చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాట్లాడుతూ.... కొంత మంది విద్యార్థుల నుంచి కొన్ని సూచనలు తీసుకున్నానని తెలిపారు, యువత ఆందోళనను దేశ ప్రజలు అర్థం చేసుకున్నట్లు సూచించారు. యువత సెంటిమెంట్ ను అన్ని పార్టీలు గౌరవించాయని, విద్యార్థుల ఆందోళనను బీజేపీ నేతల పిల్లలు సమర్థించారన్నారు. విద్యార్థుల నిరసనను కేంద్రం అర్థం చేసుకోకుండా మూర్ఖంగా వ్యవహరించిందని విమర్శించారు. విద్యారంగం ఖరీదైన వ్యాపారంగా మారిందన్న రాహుల్ గాంధీ పేదలు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య వ్యవస్థపై మాట్లాడేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తీవ్ర వేదన తర్వాతే ఢిల్లీ వేదికగా విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేశారని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఉన్న విద్యార్థులు ఆందోళనకు గురయ్యారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. శాంతియుత నిరసన చేస్తున్న వారిని రెచ్చగొట్టేలా పోలీసులు ప్రవర్తించారని ఆగ్రహించారు. మూర్ఖులు ఎవరి మాటలు వినరని.. విద్యార్థులు తనతో చెప్పినట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు తమ ఆవేదనను పట్టించుకోవట్లేదని విద్యార్థులు చెప్పారని సూచించారు. యువత ఆవేదనను పట్టించుకోలేదనే విద్యార్థులు రోడ్ల పైకి వచ్చారు, రోడ్లపైకి వచ్చిన విద్యార్థులపై లాఠీఛార్జి చేసి పోలీసులు హింసించారని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.
పేపర్ లీక్ వార్త విని.. విద్యార్థులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
పరీక్షల కోసం విద్యార్థులు ఎంతో కష్టపడతారు, విద్య కోసం లక్షలు ఖర్చుపెడుతున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం రాత్రింబవళ్లు చదువుతారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఒక్కసారిగా పేపర్ లీక్ వార్త వినగానే తీవ్ర ఆవేదనకు లోనయ్యారని వెల్లడించారు. విద్యార్థుల ఆవేదన అర్థం చేసుకున్నందుకే వారి పక్షాన మాట్లాడుతున్నట్లు సూచించారు. లోక్ సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థుల పేరుతో అనుచితవ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ నేతలు సూచించారు.






