29 July, 2026 | 1:25 PM

తాళిపేరుకు జలకళ

29-07-2026 12:53 PM

తాళిపేరు ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తివేత

73.39 మీటర్లకు చేరిన నీటి మట్టం - 30 024 క్యూసెక్కుల నీరు విడుదల

చర్ల, జులై 29,( విజయక్రాంతి): తాళిపేరు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులోకి(Taliperu Project gates lifted) వరద నీరు పోటెత్తడంతో అధికారులు 22 గేట్లను 2 అడుగుల మేర ఎత్తివేశారు. ఉదయం 9.30 గంటలకు అధికారులు తీసుకున్న కొలతల ప్రకారం ప్రాజెక్టు దాదాపు పూర్తి స్థాయికి చేరుకుంది. నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో గేట్ల ద్వారా అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అధికారులు దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నది పరివాహక ప్రాంతాల్లో ఎవరూ నదిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. తాళిపేరు ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీరు చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని లోతట్టు ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది.

ప్రస్తుత పరిస్థితి:

- గేట్ల ద్వారా విడుదల: 30,024 క్యూసెక్కులు

- ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్‌ఫ్లో: 27,395 క్యూసెక్కులు  

- ప్రస్తుత నీటి మట్టం: 73.39 మీటర్లు

- పూర్తి నీటి మట్టం - FRL: 74.00 మీటర్లు

- క్రెస్ట్ లెవెల్: 69.00 మీటర్లు

- ప్రస్తుత నిల్వ సామర్థ్యం: 615 మెక్యూఫ్టులు

- పూర్తి సామర్థ్యం: 730 మెక్యూఫ్టులు