17 April, 2026 | 2:35 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

పెట్రోల్ బంకు నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

12-04-2025 12:16 AM

సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి సూచన

అబ్దుల్లాపూర్ మెట్, ఏప్రిల్ 11: నాణ్యత ప్రమాణాలతో కూడుకున్న పెట్రోల్ డీజిల్ వినియోగదారులకు అందించే విధంగా పెట్రోల్ బంకు నిర్వాహకులు ముందుకు  వెళ్లాలని సూర్యాపేట ఎమ్మె ల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండల మండల కేంద్రంలో జెఎంఆర్ నూతన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మె ల్యే గుంటకండ్ల జగదీశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వినియోదారులకు పెట్రోల్ బంక్ నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలతో కూడిన పెట్రోల్,  డీజిల్ విక్రయిం చాలన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇన్ చార్జీ క్యామ మల్లేష్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, జేఎంఆర్ పెట్రోల్ బంక్ నిర్వాహకులు జెక్కిడి రఘు రఘువీర్ రెడ్డి, ఎల్బీనగర్ బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.