ఇప్పుడు అన్ని చోట్లా మెజారిటేరియన్ వాదం ప్రబలంగా నడుస్తూంది. ఈ దేశ సంస్కృతిని నిర్మించటంలో గణనీయమైన పాత్ర పోషించిన వేదబాహ్యులు నేడు సమాజపు అంచుల్లోకి నెట్టబడ్డారు. నిజానికి వీరు ఈ దేశమూలవాసులు. ‘హిందూమతమే భారతదేశపు ఆత్మ’అని పలికే మాటలకు ఈ వేదబాహ్య సంస్కృతి ఒక కనువిప్పు. చరిత్రలో వేదబాహ్యు లు నెరపిన సామాజిక, సాంస్కృతిక పాత్ర గురించి వ్యాసాలు మాట్లాడతాయి. స్వేచ్ఛ, సమానత్వం, కార్యకారణ వివేచన, లౌకికత్వం కొరకు వారు ఎలా నిలబడ్డారో చెబుతాయి. నేటి మెజారిటేరియన్ భావజాలానికి ఒకనాడు సమవుజ్జీవులుగా నిలిచిన భిన్న ప్రత్యామ్నాయ విశ్వాసాలను ఇంకా అదే కోవలోని అంశాలను ఈ పుస్తకం పరిచయం చేస్తుంది.
బొల్లోజు బాబా
పుస్తకాల కోసం: 9866115655