‘ఉత్తమ నవల’కు బహుమతి రూ.10,000/

29-04-2024 12:05:00 AM

ఒద్దిరాజు సోదర కవుల స్మృత్యర్థం ‘ఉత్తమ నవలా పురస్కారం’ కోసం వరంగల్ ‘సహృదయ’ సాహిత్య సాంస్కృతిక సంస్థ 2024 సంవత్సరానికిగాను రచయితల నుంచి నవలలను ఆహ్వానిస్తున్నది. పై సంస్థ 26వ వార్షికోత్సవం సందర్భంగా జూన్ (౨౦౨౪)లో జరిగే ఒక కార్యక్రమంలో ‘సహృ దయ సాహితీ పురస్కారం ప్రదా నం జరుగుతుంది. ఎంపికైన రచయితకు నగదు బహుమతి రూ.10,000లు పారితోషికంగా అందిస్తారు. 2017 జనవరి నుండి 2023 డిసెంబర్‌లోగా పుస్తక రూపంలో ప్రథమ ముద్రణ పొందిన నవలలు మాత్రమే ఈ పురస్కారానికి అర్హమైనవిగా నిర్వాహకులు తెలిపారు. 

రచయితలు తమ నవలలను మూడు ప్రతుల చొప్పున పంపాలి. కాగా, వివిధ సాహిత్య ప్రక్రియలలో గ్రంథాలను ముద్రించిన రచయితలు, కవులకు ఈ పురస్కారాన్ని ౧౯౯౬ నుంచి అందిస్తున్నట్లు పై సంస్థ పేర్కొంది. అలాంటి వారిలో డా॥కేశవరెడ్డి, కీ.శే. అల్లం శేషగిరిరావు, డా॥ నాళేశ్వరం శంకరం, డా॥ అనుమాండ్ల భూమయ్య, ఆచార్య ఎస్.వి.రామారావు, గొల్లపూడి మారుతిరావు, మునిపల్లె రాజు, డా॥ ఎండ్లూరి సుధాకర్, డా॥ గరికిపాటి నరసింహారావు, డా॥ జయప్రభ, డా॥ ఎం.వి. తిరుపతయ్య, శ్రీమతి కె.వరలక్ష్మి, దర్భశయనం శ్రీనివాసాచార్య, డా॥ పుల్లూరి ఉమ, డా॥ బన్న ఐలయ్య, కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్లు, డా॥ కాలువ మల్లయ్య, రామా చంద్రమౌళి, నల్లదీగ శ్రీనివాసాచార్యులు, డా॥ సిహెచ్.లక్ష్మణ చక్రవర్తి, శిరంశెట్టి కాంతారావు, బి.మురళీధర్, శ్రీమతి మందరపు హైమవతి, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు వున్నారు. 

పరిశీలనార్థం పంపే నవలలు 

చేరడానికి చివరి తేదీ: 31.5.2024 

చిరునామా: కుందావజ్ఝల కృష్ణమూర్తి, సాహిత్య కార్యదర్శి, 

‘శ్రీమాత’ ఫ్లాట్ నెం: 207, 

ఇం.నెం. 2 

సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, 

హనుమకొండ 

సెల్: 98493 66652 

చిరునామా: కుందావజ్ఝల కృష్ణమూర్తి,