బెడ్ కింద రూ.1.54 కోట్లు.. నరహరి అక్రమాస్తుల షాకింగ్ లెక్కలు
ఏసీబీకి చిక్కిన ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి
- ఇళ్లు, ఆఫీసుతో పాటు 10 చోట్ల సోదాలు
- ఛత్రినాక ఇంట్లో మంచం కింద రూ.1.54 కోట్ల నగదు
- 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి నగలు, ఒక కియా కారు స్వాధీనం
- బ్యాంకు ఖాతాల్లో రూ. 2.29 కోట్లు గుర్తింపు
- రూ. 5.04 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు
- పలుచోట్ల ప్లాట్లు, వ్యవసాయ భూముల గుర్తింపు
- ప్రభుత్వ లెక్క ప్రకారం ౧౩.౦౫ కోట్ల ఆస్తుల గుర్తింపు
- బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ
- 150 కోట్లకు పైనే
- నిందితుడి భార్య పేరున 2 బ్యాంక్ లాకర్లు..
ల్యాండ్ అండ్ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దాడులు నిర్వహించింది. హైదరాబాద్ సహా 10 ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో రూ.1.54 కోట్ల నగదు, 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి, కోట్ల విలువైన స్థిరాస్తులు గుర్తించబడ్డాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.13.05 కోట్ల ఆస్తులు ఉండగా, మార్కెట్ విలువ రూ.150 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సికింద్రాబాద్/ముషీరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): ఆదాయానికి మించి న ఆస్తుల కేసులో ల్యాండ్ అండ్ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిని ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా నరహరి అవినీతి అక్రమాలపై నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు, హైదరాబాద్‌లోని ఆయన ఇల్లు, కార్యాలయాలతో పాటు బినామీలు, బంధువుల ఇళ్లలో పది చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
తెలంగాణలో జరుగుతున్న ఏసీబీ దాడులు, అవినీతి కేసులు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం విజయక్రాంతి న్యూస్ ను ఫాలో అవ్వండి.
మంచం కింద దాచిన రూ.1.10 కోట్ల నగదు, రూ.150 కోట్లకు పైగా ఆస్తుల అంచనా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
నరహరి తమ్ముడి నివాసం లోనూ సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో నరహరి అక్రమంగా కూడబెట్టిన ప్రభు త్వ లెక్కల ప్రకారం రూ.౧౩.౦౫ కోట్ల ఆస్తులను గుర్తించగా.. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. రాష్ట్ర సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ మల్టీ జోన్ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నరహరి ఆదాయానికి మించి ఆస్తులను సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తిం చారు.
ల్యాండ్ రికార్డుల విషయంలో కింది స్థాయి సిబ్బందితో కలిసి ఆయన పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు అనేక ఆరోపణలు వచ్చాయి. ఆయన మీద కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు మంగళవారం ఏసీబీ డీఎస్పీ గంగ సాని శ్రీధర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఛత్రినాకలోని నరహరి నివాసం, నారాయణగూడలోని సర్వే భవన్ కార్యాలయంతో పాటు ఆయన బంధువులు, బినామీలకు చెందిన పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడు లు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలను తాజా వార్తలు విభాగంలో చదవండి.
ఈ సోదాల్లో అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించారు. నరహరి ఇంట్లో రూ.1.54 కోట్ల నగదు లభించగా అందులో ఆయన బెడ్‌రూంలో మంచం కింద రూ.1.10 కోట్ల నగదు దొరికింది. దాదాపు 1.3 కిలోల బం గారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు, ఒక కియా కారెన్స్ కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి తో పాటు వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.2.29 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, రూ.5.04 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు.
నిందితుడి భార్య పేరిట ఉన్న రెండు బ్యాంక్ లాకర్లను గుర్తించారు. వాటిని త్వరలోనే తెరుస్తామని అధికారులు వెల్లడించారు. కాగా నరహరి గతంలో రంగారెడ్డి జిల్లాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా (ఏడీ) కూడా పనిచేశారు. ఆ సమయంలో కూడా భారీగా అక్రమాలకు పాల్పడి ఉంటారని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నా రు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం నాంపల్లి ప్రిన్సిపల్ ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరిచారు.
కోట్ల విలువ చేసే స్థిరాస్తుల గుర్తింపు
తనిఖీల్లో కోట్ల విలువచేసే స్థిరాస్తులకు సంబంధించిన భూముల డాక్యుమెంట్లు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఐదు ఓపెన్ ప్లాట్లు, మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పుప్పాలగూడలోని ఒక హైరైజ్ బిల్డింగ్‌లో 2,500 చదరపు అడుగుల నివాస ఫ్లాట్ ఉన్నట్టు కనుగొన్నారు. నార్సింగిలో రెండు ఫ్లాట్లు, రాజేంద్రనగర్‌లోని ఒక హైరైజ్ భవనంలో మరో ఫ్లాట్ ఉన్నట్లు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
రాజకీయాలు, పరిపాలన, అవినీతి నిరోధక చర్యలకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ కోసం తెలంగాణ వార్తలు చూడండి.
గచ్చిబౌలి టీఎన్జీఓస్ కాలనీలో ఒక జీ ప్లస్ త్రి భవనం, చత్రీనాకలో ఒక జీ ప్లస్ 2 నివాస భవనం ఉన్నట్లు ఏసీబీ సోదాల్లో తేలింది. మొత్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.౧౩.౦౫ కోట్ల ఆస్తులు గుర్తించగా బహిరంగ మార్కెట్‌లో వీటి రూ.150 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
FAQ's
1. నరహరి ఇంట్లో ఏసీబీకి ఏమి దొరికింది?
ఏసీబీ సోదాల్లో డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో రూ.1.54 కోట్ల నగదు, 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి, రూ.2.29 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, రూ.5.04 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు గుర్తించబడ్డాయి.
2. నరహరి ఆస్తుల విలువ ఎంత?
ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.13.05 కోట్ల ఆస్తులు గుర్తించగా, బహిరంగ మార్కెట్ విలువ రూ.150 కోట్లకు పైగా ఉండవచ్చని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.
3. నరహరిని ఎందుకు అరెస్ట్ చేశారు?
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది.
4. ఎంత నగదు స్వాధీనం అయింది?
మొత్తం రూ.1.54 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
5. బంగారం, వెండి ఎంత లభించింది?
1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి వస్తువులు గుర్తించారు.
6. ఆస్తుల విలువ ఎంత?
ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.13.05 కోట్లు కాగా, మార్కెట్ విలువ రూ.150 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా.
7. దాడులు ఎన్ని చోట్ల జరిగాయి?
హైదరాబాద్ సహా 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.






