24 August, 2026 | 11:41 AM

Breaking News

కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం   •   మంత్రి కొండా సురేఖ వివాదానికి సీఎం రేవంత్ చెక్ పెడతారా?   •   గోడ దూకిన ఇంటర్ విద్యార్థులు   •   భవనం కూలిన ఘటనలో బిల్డర్‌ సయ్యద్‌ సజీద్‌ అరెస్ట్   •   సోయం ముందస్తు వ్యూహం.. అధిష్టానం ఆదేశాలతో పల్లెబాట   •   నిశ్చితార్థం రోజే విషాదం.. కారు ప్రమాదంలో యువకుడు మృతి   •   వర్షాలు కురుస్తలేవని కుళ్ళిన శవాన్ని తీసి మళ్ళీ ఖననం.!   •   కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్   •   మొక్కును చెల్లించుకున్న దంపతులు.. శ్రీ సీతారామచంద్ర స్వామికి వెండి కానుకలు   •   హైదరాబాద్‌ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి   •  

భక్తుల సౌకర్యం కోసమే తీర్థయాత్రల బస్సు

27-06-2025 06:25 PM

నిర్మల్,(విజయక్రాంతి): భక్తుల సౌకర్యం కోసమే టీజీ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు(TG RTC Special Bus Services) నడుపుతున్నట్టు నిర్మల్ డిఎం పండరీ(Nirmal Depot Manager K.Pandari) తెలిపారు. నిర్మల్ నుండి అరుణాచలం, రామేశ్వరం బస్సు శుక్రవారం ప్రారంభించారు. ఈ బస్సు కానిపాకం, అరుణాచలం, పలని,  పాతాళ శెంబు, రామేశ్వరం, ధనుష్కోడి వెళ్లి తిరిగి నిర్మల్ కు జులై 2వ  తేదీన వస్తుందని తీర్థయాత్రలకు బస్సులు నడుపుతున్నట్లు తెలుపగానే ప్రయాణికులు 2 రోజుల్లోనే టికెట్లు బుక్ చేసుకున్నారని డిపోమేనేజర్ కే పండరి పేర్కొన్నారు.

 మళ్ళీ అరుణాచలం, రామేశ్వరం బస్సు జులై నెలలో ఉంటుందని ఆయన తెలిపారు. జులై చివరి వారములో ప్రయాగ్ రాజ్, వారణాసి, అయోధ్య, భద్రాచలం, అన్నవరం, సమ్మక్క, సారలక్కలకు కూడా బస్సు పెడుతున్నట్లు డిపోమేనేజర్ అన్నారు. నిర్మల్ నుండి ఏ పుణ్యక్షేత్రలకయినా బస్సులు ఇస్తామని ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని ఆయన కోరారు. మీరు ఎక్కడికెళ్లాలన్న 9959226003, 83280 21517 ఫోన్ లో సంప్రదించాలని ఆయన కోరారు.