30 June, 2026 | 10:37 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

నిర్దేశించిన లక్ష్యాలు అధిగమించేలా ప్రణాళికలు

01-04-2025 02:52 AM

సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ జీ దేవేందర్

మందమర్రి, మార్చి 31 : 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలలో కేవలం 78 శాతం మాత్రమే బొగ్గు ఉత్పత్తి సాధ్యమైందని గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే బొగ్గు ఉత్పత్తి తగ్గిందని ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ తెలిపారు. ఏరియాలోని జిఎం కార్యాలయం ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వార్షిక బొగ్గు ఉత్పత్తి వివరాలను వెల్లడించారు.

ఏరియాకు గత ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన 34.6 లక్షల టన్నులకు గాను 27.10 లక్షల టన్నుల బొగ్గు  ఉత్పత్తి సాధ్యమైందన్నారు. ఏరియాలోని కేకే 5 గని 103 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించగా, కాసిపేట గని 62% కాసిపేట 2 గని 59%, శాంతిఖని 47%, ఆర్కేపి ఓసి 139%, కేకే ఓసీలో 63% బొగ్గు ఉత్పత్తి సాధ్యమైందన్నారు. ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన లక్ష్యాలలో ఏడు లక్షల 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి వెనుకబడిందని రానున్న రోజుల్లో ఏరియాలో బొగ్గు  ఉత్పత్తి మెరుగుపరిచి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.

అంతేకాకుండా నూతన మ్యాన్ రైడింగ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని శాంతిఖనిలో నూతన ప్యానల్ ద్వారా బొగ్గు ఉత్పత్తి మెరుగుపడు తుందన్నారు. అంతేకాకుండా నూతనంగా లాంగ్ వాల్ టెక్నాలజీ ద్వారా బొగ్గు ఉత్పత్తి సాధించేందుకు ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్‌ఓటు జిఎం విజయ ప్రసాద్, ఐఈడి రాజన్న, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, డివైఎస్‌ఈ సివిల్ రాము, ఏజిఎం వెంకటరమణ, డివైపిఎం మైత్రేయ బంధు లు పాల్గొన్నారు.