calender_icon.png 7 June, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాస్టిక్ సర్జరీ

13-01-2025 12:00:00 AM

సిటి అంటే అన్నీ బ్యూటీ బిల్డింగులు కావు ఇది వెరైటీ సమస్యల మనుష్యుల సమ్మేళన కోలాహలం సొసైటీ స్ట్రీట్ లైట్ కింద ఫ్యాషన్ పురుగులు అందంగా ఎగురుతూ మెరుస్తూంటాయి. నైంటీపర్సెంట్ హృదయానికి క్లోరోఫాం ఇచ్చి మెదడును మాత్రమే ‘లెటస్ గో’ అంటుంటారు. ఎంత చేసినా ఎవడికీ తీరిక దక్కదు, కోరిక చిక్కదు. మెర్క్యురీ నవ్వులు, పాదరసం నడకలు. 

కొందరికి రెండు కాళ్ళు రిక్షావాడికి మూడు కాళ్ళు ఉన్నవాడికి నాలుక్కాళ్ళు అందరూ కాంప్టీషన్‌లో పాల్గొన్నట్లే... అన్నీ ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న ముఖాలే... ఎవడిది వట్టి డాబో ఎవడు దొరబాబో అంతు చిక్కదు.ఇక్కడ కొన్ని నెమళ్ళుంటాయి. వాటితో చెలిమి చేస్తే కంటిలో కాదు సూటిగా గుండెలోనే పొడుస్తాయి.మరెన్నో తోడేళ్ళుంటాయి.ఇవి మనిషినేం చేయవు కేవలం శ్రమను మాత్రమే తోడేస్తాయి.

నగరం..అర్థం కాని రసాయనశాలఅందమైన శ్మశాన వాటికనగరం. చిక్కువిడని పద్మవ్యూహం చెక్కుచెదరని మయసభ నగరం..మేడి పండు -వేడి పుండు. కొందరికిది అక్షయపాత్ర, -మరెందరికో గుండెల పైనించి పయనించె కాలం రాక్షసయాత్ర. నగరం..రహస్యం బద్దలు కాని గర్భ నిరోధం. (‘ఎర్రపావురాలు’ నుంచి..)