ఈనెల 20న మెడికల్ షాపుల బందుకు సహకరించండి
ఖానాపూర్ మెడికల్ అసోసియేషన్
ఖానాపూర్,(విజయక్రాంతి):ఆల్ ఇండియా కెమిస్ట్రీ స్ ,డ్రగ్గిస్టులు అసోసియేషన్ పిలుపుమేరకు ఈనెల 20న ఖానాపూర్ లో మెడికల్ షాపుల బందుకు సహకరించాలని కోరుతూ ఖానాపూర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు అధ్యక్షులు కే రాము ఆధ్వర్యంలో తహసిల్దార్ ,మున్సిపల్ కమిషనర్ ,పోలీస్ స్టేషన్ లో వినతి పత్రం సమర్పించారు.
దేశంలో ఆన్లైన్ విక్రయాలతో వినియోగదారులు నష్టపోతున్నారని ,అంతేకాకుండా నకిలీ మందులు సరఫరా చేయడం వల్ల రోగులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని గతంలో కరోనా సమయంలో ఆన్లైన్ విక్రయాలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే కొనసాగించడం సరికాదని దాన్ని రద్దుచేసి మెడికల్ షాపుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
ఇప్పటికే 12 లక్షల 40 వేల మెడికల్ షాపులు మూతపడ్డాయని ఆన్లైన్ విక్రయాల ద్వారా తమ కుటుంబాలు వీధిన పడే అవకాశం ఉండడం వల్ల ఈ విక్రాయాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 20న బందు పాటిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎస్ ప్రసాద్, గౌరవాధ్యక్షుడు బుడికే శ్రీనివాస్ ,ఉపాధ్యక్షుడు కామోజీ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి రామ్ వంశీ ,సింగం వెంకటేష్ ,ముఖ్య సలహాదారులు విశ్వనాధుల చంద్రశేఖర్, బుడికే మణికంఠ, నవీన్, కార్తీక్ ,రాజ్ కుమార్ ,తదితరులు ఉన్నారు.






