calender_icon.png 20 December, 2025 | 10:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదుకోండి ప్లీజ్..

19-12-2025 12:00:00 AM

  1. పాడైన రెండు కిడ్నీలు, ఏడాదిగా డయాలసిస్ పైనే.. 
  2. విధితో పోరాడుతున్న యువకుడు 
  3. కిడ్నీ మార్పిడికి రూ. 25 లక్షలు 
  4. ఆదుకోవాలని వేడుకుంటున్న మహేష్

 గజ్వేల్, డిసెంబర్18: మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ ఆదుకోండి ప్లీజ్ అంటూ గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన సల్లూరి మహేష్ ఆపన్న హస్తం కోసం దయనీయంగా ఎదురుచూస్తున్నాడు. బంగ్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన సల్లూరి మహేష్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసేవాడు. ఏడాదిగా రెండు కిడ్నీలు పాడైపోవడంతో డయాలసిస్ పైనే ఆధారపడి జీవనం వెల్లదీస్తున్నాడు.

దీంతో కుటుంబం కూలీ పని చేసుకుని తమను తాను పోషించుకోవాల్సి వస్తుంది. వైద్యులు కిడ్నీల మార్పిడికి అవకాశం ఉందని చెప్పడంతో మహేష్ తండ్రి సల్లూరి రామయ్య కన్న కొడుకుకు కిడ్నీ దానం చేసి ప్రాణం నిలబెట్టాలని సిద్ధమయ్యాడు. కానీ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కు రూ. 25 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు.

ఆర్థికంగా పూర్తిగా దీన స్థితిలో ఉన్న మహేష్ తనను ఆర్థికంగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. కిడ్నీ ఆపరేషన్ కు దయార్థ హృదయులు తనకు ఆర్థికంగా సహకరించాలని వేడుకుంటున్నాడు. 8179957295 ఫోన్ నెంబర్ కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు పంపి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కు దాతలు ఆర్థికంగా సహకరించాలని కోరుతున్నాడు.