కొమరం భీమ్ నగర్ గ్రామంలో త్రాగునీటి సమస్య కు పరిష్కారం చూపండి
ములకలపల్లి,(విజయక్రాంతి): కొమరం భీమ్ నగర్ గ్రామస్థులకు త్రాగునీటి కోసం బోరుకు పరిమిషన్ కల్పించాలని సిపిఎం పార్టీ మండల నాయకులు నిమ్మల మధు డిమాండ్ చేశారు. సోమవారం భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ కు బోరు సమస్య పై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఏళ్ళు గా కొమరం భీమ్ నగర్ గ్రామంలో నివసిస్తున్న గ్రామస్తులకు త్రాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదని అన్నారు. వలస ఆదివాసిలకు కొన్ని స్వచ్ఛంద సంస్థల వారు బోరు వేయించేందుకు ముందుకు వస్తే దీనికి స్థానిక ఫారెస్టు అధికారులు నిరాకరిస్తూ వలస ఆదివాసిల పై కక్ష సాధింపు చర్యలేనని విమర్శించారు.
మండలంలోని కొన్ని వలస ఆదివాసి గ్రామాలకు బోరులకు పరిమిషన్ ఇచ్చి కొమరం భీమ్ నగర్ గ్రామానికి త్రాగునీరు కోసం బోరు వేయించేందుకు పరిమిషన్ నిరాకరించడం సరైనది కాదని చెప్పారు. త్రాగునీరు లేక పాములేరు వాగులో నుంచి చెలిమి తీసి ఆనీటిని తెచ్చుకుని త్రాగుతున్న వలస ఆదివాసి పై కనికరించని రాష్ట్ర ప్రభుత్వమని ఆవేదన వ్యక్తం చేశారు. పాములేరువాగులో నీటిని త్రాగి కొమరం భీమ్ నగర్ గ్రామస్థులకు వివిధ అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. తక్షణమే కొమరం భీమ్ నగర్ గ్రామానికి త్రాగునీరు బోరు వేయించేందుకు పరిమిషన్ ఇప్పించాలని కోరారు.






