నేరేడుచర్ల మండలంలో డిజిటల్ క్రాప్ సర్వే
31-08-2026 10:44 PM
నేరేడుచర్ల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిజిటల్ క్రాప్ సర్వే నేరేడుచర్ల మండలంలో కొనసాగుతున్నదని, మండల వ్యవసాయ అధికారి ఎస్కే జావేద్ తెలిపారు. రెవెన్యూ గ్రామాల వారీగా వాలంటీర్ల ద్వారా ఈ సర్వేను నిర్వహిస్తునట్లు తెలిపారు. ఇందులో భాగంగా డిజిటల్ అధికారులు నేరేడుచర్ల గ్రామంలో జరుగుతున్న డిజిటల్ క్రాప్ సర్వేను అధికారులు పరిశీలించారు. రైతులు పండిస్తున్న పంటల వివరాలను క్షేత్రస్థాయిలో ఎలా నమోదు చేస్తున్నారో పరిశీలించి, వాలంటీర్లకు తగు సూచనలు, సలహాలు అందించారు. సర్వేను పకడ్బందీగా, తప్పులు లేకుండా చేయాలని సూచించారు.






