కెమికల్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: రాజస్థాన్‌లోని భివాడి పట్టణంలోని ఒక రసాయన కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో(Rajasthan Chemical Factory Fire accident) ఫ్యాక్టరీ కార్మికులు మరణించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi Condoles) సోమవారం సంతాపం వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రాజస్థాన్‌లోని భివాడిలో జరిగిన అగ్ని ప్రమాదం విషాదకరమైనది, తీవ్ర బాధాకరం అని ప్రధాని కార్యాలయం మోడీని ఉటంకిస్తూ ఎక్స్ లో పేర్కొంది. "తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
రాజస్థాన్‌లోని ఖుష్ఖేరా-కరోలి పారిశ్రామిక ప్రాంతంలోని భివాడిలోని ఒక రసాయన కర్మాగారంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించి ఏడుగురు మృతి చెందగా, ఇద్దరు చిక్కుకున్నట్లు సమాచారం. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ సుమితా మిశ్రా మాట్లాడుతూ, "లోపల తొమ్మిది మంది చిక్కుకున్నారు. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను బయటకు తీశారు" అని ఆమె చెప్పారు, మిగిలిన ఇద్దరిని రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.




