Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి
న్యూఢిల్లీ: భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్-క్లాస్ రాకెట్ 'విక్రమ్-1'(Skyroot Vikram-1) శనివారం నాడు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి నింగిలోకి దూసుకెళ్లింది. విక్రమ్ -1 ప్రయోగం విజయవంతం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తలతో మోదీ ఫోన్ లో మాట్లాడారు. స్కైరూట్ విజయం.. దేశ యువతకు స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు.
విక్రమ్-1 ప్రయోగాన్ని తాను కూడా వీక్షించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఏళ్ల తరబడి స్కైరూట్ కృషికి ఫలితమే ఈ విజయమని ప్రధాని కొనియాడారు. అంతరిక్షంలో ప్రైవేటు రంగం ఆహ్వానంపై మొదట్లో సందేహాలొచ్చాయని సూచించారు. ప్రైవేటు సంస్థలు విజయం సాధించలేవని కొంతమంది అన్నారని స్పష్టం చేశారు. ప్రైవేటు రంగంపై ఉన్న సందేహాలను మీరు పటాపంచలు చేశారని చెప్పారు. త్వరలోనే స్కైరూట్ బృందాన్ని కలుస్తానని ప్రధాని వెల్లడించారు.






