Vikram-1 రాకెట్ విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం
నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1 రాకెట్
శ్రీహరికోట: విక్రమ్-1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. విక్రమ్-1(Vikram-1) రాకెట్ ప్రయోగం విజయవంతం అయినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీంతో భారత రోదసీ చరిత్రలో సరికొత్త ఆధ్యాయం మొదలైంది. ఇస్రో నుంచి తొలిసారి ప్రైవేట్ రాకెట్ ప్రయోగించారు. విక్రమ్ -1 రాకెట్ విజయవంతంగా(Vikram-1 rocket mission successful) నింగిలోకి దూసుకుపోయింది. స్కైరూట్ లాంచ్ కంట్రోల్ సెంటర్ లో సంబరాలు మిన్నంటాయి. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ప్రయోగాన్ని శనివారం "ముందుగా నిర్ణయించిన విధంగా నిలిపివేశారు" (planned hold), అయితే ఈ ప్రక్రియ త్వరలోనే తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
స్కైరూట్ ఏరోస్పేస్(Skyroot Aerospace) రూపొందించిన విక్రమ్-1 రాకెట్ ఉదయం 11:30 గంటలకు నింగిలోకి ఎగరాల్సి ఉంది. నావిగేషన్ సమస్యల కారణంగానే ఈ ప్రక్రియ నిలిపివేయబడినట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్యతో విక్రమ్ ప్రయోగం 35 నిమిషాలు ఆలస్యం అయింది. రాకెట్ ప్రయోగ సమయాన్ని శనివారం మధ్యాహ్నం 12:05 గంటలకు మార్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి. పరిస్థితి సమీక్షించి ప్రయోగ సమయాన్ని ఇస్రో, స్కైరూట్ ప్రకటించింది. ఇస్రో నుంచి తొలిసారి ప్రైవేట్ సంస్థ రాకెట్ ప్రయోగం చేస్తోంది. ప్రైవేట్ సంస్థ రూపొందించిన మొట్టమొదటి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1.






