30 August, 2026 | 3:09 PM

డ్రగ్స్‌కు బానిసైతే.. వ్యక్తికే కాకుండా సమాజానికీ నష్టం

30-08-2026 12:27 PM

డ్రగ్స్ కు బానిసైతే వ్యక్తికే కాదు సమాజానికీ నష్టం

దేశం డ్రగ్స్ రహిత భారత్ గా మారాలి

మాదక ద్రవ్యాల వల్ల నష్టాలు అధికం

న్యూఢిల్లీ: నషా ముక్త్ యువ భారత్ కార్యక్రమాన్ని ప్రచారం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) 137వ మన్ కీ బాత్ ఎపిసోడ్(PM Modi 137th Mann Ki Baat) లో పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వల్ల నష్టాలు అధికమన్న ప్రధాని మోదీ దేశం డ్రగ్స్ రహిత భారత్(Drug-free India)గా మారాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ కు బానిసైతే వ్యక్తికే కాకుండా సమాజానికీ నష్టమని హెచ్చరించారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని పిలుపునిచ్చారు. నషా ముక్త్ యువ హ్యాష్ ట్యాగ్స్(Nasha Mukt Bharat Abhiyaan) పేరుతో పోస్టులు పెట్టాలని సూచించారు. పీఎం స్వనిధి ద్వారా మహిళా సాధికారత సాధ్యమైందని తెలిపారు. PM SVANidhi ద్వారా 35 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారని ప్రకటించారు. వ్యాపారా వృద్ధికి పీఎం స్వనిధి ఉపయోగపడుతోందన్నారు. మహిళల వ్యాపారం వృద్ధి చెందితే.. కుటుంబమూ వృద్ధిలోకి వస్తోందని సూచించారు.