calender_icon.png 12 November, 2025 | 5:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్రకోట పేలుడు బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ

12-11-2025 04:10:52 PM

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనలో గాయపడిన బాధితులను బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. భూటాన్ లో రెండు రోజులు పర్యటన ముగించుకుని ఢిల్లీకి వచ్చిన ప్రధాని నేరుగా లోక్ నాయక్ జై ప్రకాష్ (ఎల్‌ఎన్‌జెపి) ఆసుపత్రికి వెళ్లారు. ఎర్రకోట పేలుడులో గాయపడిన వారిని ప్రధాని వ్యక్తిగతంగా కలుసుకుని సంభాషించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ప్రధాని మోదీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎర్రకోట పేలుడు కుట్రదారులను వదిలిపెట్టబోమని ఆయన హామీ ఇచ్చారు. 

సోమవారం ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడులో కారు ధ్వంసమై 12 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ పేలుడులో మృతదేహాలు ఛిన్నాభిన్నమైన, కార్లు ధ్వంసమయ్యాయి. జైష్-ఎ-మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఉగ్రవాద మాడ్యూల్‌ను ఛేదించిన తర్వాత హర్యానాలోని ఫరీదాబాద్ నుండి 2,900 కిలోగ్రాముల ఐఈడీ తయారీ పదార్థాన్ని స్వాధీనం చేసుకున్న రోజే ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు.