18 May, 2026 | 5:39 PM

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుగులో చెప్పిన ప్రధాని మోడీ

25-08-2024 12:36 PM

న్యూఢిల్లీ: ఆకాశవాణి ద్వారా ప్రధాని మోడీ 'మన్ కీ బాత్' కార్యక్రమం నిర్వహించారు. అంతరిక్ష రంగంలో భారత్ దూసుకెళ్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. చంద్రయాన్-3 విజయానికి గుర్తుగా స్పేస్ డే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది తొలిసారి అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ నిలిచిందని మోడీ తెలిపారు. స్పేస్ సైన్స్ యువత దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పారు.

రాజకీయాల్లోకి రావాలన్న పిలుపుతో యువత నుంచి స్పందన వచ్చింది.. క్రియాశీల రాజకీయాల వైపు యువత మొగ్గు చూపుతోందని వెల్లడించారు. ఈ ఏడాది 'హర్ ఘర్ తిరంగా' ప్రచారం పెద్దఎత్తున చేపట్టామన్నారు. ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాల వద్ద జాతీయజెండాలు ఆవిష్కరించారని ప్రధాని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం అనేది సామాజిక ఉత్సవంగా మారిందన్నారు. వెబ్ సైట్ లో 5 కోట్లకుపైగా ఫొటోలు ఆప్ లోడ్ చేశారని మోడీ చెప్పారు. ఆగస్టు 29న తెలుగుభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ప్రధాని మోడీ తెలుగుభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుగులో చెప్పారు.