18 May, 2026 | 6:31 PM

పల్లా రాజేశ్వర్ రెడ్డిపై అక్రమ కేసులు: హరీశ్ రావు

25-08-2024 11:45 AM

హైదరాబాద్: ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. అయితే కాంగ్రెస్ కండువా కప్పుకోండి.. లేదంటే టార్గెట్ చేస్తాం అన్నట్లుగా పాలన ఉందని ఆరోపించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఆరు కేసులు పెట్టారు.. మానసికంగా, పొలిటికల్ గా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. హైడ్రాను రాజకీయ కక్షసాధింపులకు వాడుకుంటున్నారు హరీష్ రావు పేర్కొన్నారు.