14 July, 2026 | 11:49 AM

Breaking News

లులు మాల్‌లో గన్ కలకలం   •   కల్లూరులో గంజాయి రవాణా – ముగ్గురు అరెస్ట్   •   కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ   •   విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   Dollar vs Rupee: తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •  

పబ్బుల్లో ఎక్సైజ్ శాఖ ఆకస్మిక తనిఖీలు

25-08-2024 12:55 PM

25 పబ్బుల్లో డ్రగ్ డిటెక్షన్ కిడ్స్ తో పరీక్షలు.

హైదరాబాద్: ఉద్యోగులు పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి, చదువుల ఒత్తిడి నుంచి యువత స్నేహితులతో కలిసి వీకెండ్ ను ఎంజాయ్ చేయడానికి పబ్బులకు పరిపాటిగా మారింది. ఇదేం తప్పు కాకపోయినా.. కస్టమర్లను ఆకర్షించడానికి.. ఆనంద లోకాలకు తీసుకువెళ్లడానికి పబ్బుల్లో ఆలధాన్ని పంచే మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చే సంగీతం సంగీతం అందిస్తూ ఉంటారు.. ఇలాంటి అవకాశాలను.. అందిపుచ్చుకోవడానికి యువత,  ఉద్యోగస్తులకు అపభ్రంశం చేయడానికి కొందరు అక్రమార్కులు  ఈ మధ్యకాలంలో డ్రగ్స్ ను ప్రవేశపెట్టినట్లు తెలియ వస్తుంది. పబ్బుల్లోనూ బార్లలోను డ్రగ్స్ ను అరికట్టడానికి ఎక్సైజ్ శాఖ సడన్ అండ్ సర్ప్రైజ్ తనిఖీలు నిర్వహించడానికి వీకెండ్ లో సన్నాహాలు చేపట్టింది.

గతవారం 25 పబ్బుల్లో తనిఖీలు నిర్వహించగా ఈ వీకెండ్ శనివారం రాత్రి పది గంటల నుంచి హైదరాబాద్ రంగారెడ్డి లోని 25 బార్లను పబ్బులను సడన్ సర్ప్రైస్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీలతోపాటు  డక్స్ డిటెక్టర్ వీటితో పబ్బులోని వచ్చిన వాళ్లకి ట్రక్స్ తీసుకున్నారా లేదా అనే విషయంలో స్పాట్ స్కిట్స్ తో  పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ రంగారెడ్డి లోని మొత్తం 25 పబ్బుల్లో శనివారం రాత్రి  పరీక్షలు నిర్వహించారు. ఎవరికి పాజిటివ్ రాలేదు. పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం లేకున్నా కూడా ఎవరైనా అడ్రస్ తీసుకువస్తే  ఎక్సైజ్ తనిఖీల్లో బయటపడతామని భయం మాత్రం అక్రమార్కుల్లో చోటు చేసుకుంది.

రెండు రెండు వీకెండ్ లో ఎక్సైజ్ అండ్ ఇన్ఫోసిమెంట్ ఎస్టిఎఫ్ డిటిఎఫ్ ఇతర ఎక్సైజ్ పోలీస్ బృందాలు తనిఖీల్లో పాల్గొన్నారు. ఒక్కొక్క టీము ఒక్కొక్క పబ్బులో తనిఖీలు నిర్వహించారు. పబ్బుల్లో నిర్వహించిన దాడుల్లో ఎలాంటి పాజిటివ్ రాకపోవడం పబ్బుల్లో డ్రగ్స్ కంట్రోల్ లో ఉంది అని   ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ దాడులకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ డైరెక్టర్ ఖురేషి, హైదరాబాద్ రంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్లు అనిల్ కుమార్ రెడ్డి ఆర్ కిషన్, ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పి తిరుపతి యాదవ్ అధికారులు తనిఖీల్లో  పాల్గొన్నారు.