రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
న్యూఢిల్లీ: శాసనసభల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేసే బిల్లు లోక్‌సభలో వీగిపోయిన ఒక రోజు తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) శనివారం రాత్రి 8.30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. "ప్రధానమంత్రి రాత్రి 8:30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు," అని భారత ప్రధానమంత్రి కార్యాలయం అధికారి తెలిపారు.
మహిళా రిజర్వేషన్ల అమలు అంశాన్ని, అలాగే పార్లమెంటులో చోటుచేసుకున్న పరిణామాలను శుక్రవారం నాడు ప్రతిపక్ష పార్టీలు 'రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు'కు వ్యతిరేకంగా ఓటు వేసిన సందర్భాన్ని మోదీ ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతకుముందు, పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ ప్రతిపాదనకు మద్దతుగా ఏకం కావడంలో విఫలమైనందుకు కాంగ్రెస్, ఇతర 'INDIA' కూటమి భాగస్వామ్య పక్షాలపై మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.






