18 April, 2026 | 4:04 PM

Breaking News

మహిళా సాధికారతకు కాంగ్రెస్సే అడ్డంకి..   •   కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి   •   మహిళా రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ ది వక్రబుద్ధి   •   ఇందిరా క్రాంతి వివోఏలకు ఉద్యమం రిజిస్ట్రేషన్ పై అవగాహన   •   మినీ గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ   •   మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •  

మహిళా బిల్లు వీగిపోవడం— బీజేపీ విధానాల ఓటమి

18-04-2026 03:00 PM
  1. మహిళా బిల్లుపై మోదీకి నిజాయితీ లేదు
  2. ప్రధాని అహంకారం తగ్గింది
  3. మహిళా బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం
  4. విపక్షాల ఐక్యతతో కేంద్ర ప్రభుత్వం ఓడిపోయింది—  ప్రధాని అహంకారం తగ్గింది

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy) ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ బిల్లు తీసుకువచ్చింది. మహిళా బిల్లు వీగిపోవడం.. బీజేపీ విధానాల ఓటమిగా భావించాలని చెప్పారు. మహిళా బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్షాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీ చాలా చేసిందని సూచించారు. మహిళా బిల్లుపై ప్రధాని మోదీకి నిజాయితీ లేదని ఆరోపించారు. నిజాయితీగా మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకువస్తే పార్లమెంట్ లో అందరూ మద్దతు తెలిపేవారని చెప్పారు. మహిళా బిల్లుపేరుతో డీలిమిటేషన్ బిల్లు తీసుకువచ్చి దక్షిణాదికి అన్యాయం చేసేవారని తెలిపారు.

మహిళా బిల్లు వీగిపోవడం.. బీజేపీ విధానాల ఓటమిగా భావించాలని చురకలంటించారు. ప్రధాని మోదీ.. ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య అంతరాలు పెట్టే విధానాన్ని విరమించుకోవాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై(Women's Reservation Bill) తమకు చిత్తశుద్ధి ఉందని సీఎం స్పష్టం చేశారు. కేంద్రానికి ఆర్థిక వనరులు దక్షిణాది నుంచి అందుతున్నాయని పేర్కొన్నారు. యూపీ ఎన్నికలలోపు మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2023 మహిళా రిజర్వేషన్ల బిల్లును యథావిధిగా అమలు చేయాలని కోరారు. మహిళా రిజర్వేషన్లలోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు.

నిన్న లోక్ సభలో బిల్లు వీగిపోవడంతో ప్రధాని మోదీ(Prime Minister Modi) అహంకారం తగ్గిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తప్పుడు చట్టాలు తీసుకువస్తే గల్లీ నుంచి పార్లమెంట్ వరకు నిరసన తెలుపుతామని హెచ్చరించారు. 2023 మహిళా బిల్లును సోమవారం పార్లమెంట్ లో పెట్టాలని కేంద్రాన్ని కోరారు. 2023 మహిళా బిల్లును పెడితే మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు.