స్వీడన్‌కు ప్రధాని మోదీ
ప్రవాస భారతీయుల ఘనస్వాగతం
స్టాక్‌హోం, మే ౧౭: భారత ప్రధాని మోదీ తన రెండు రోజుల స్వీడన్ పర్యటనలో భాగంగా ఆదివారం గోథెన్‌బర్గ్ చేరకున్నారు. ఆయన అక్కడి విమానాశ్రయంలో ఆ దేశ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టెర్సన్, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. కళాకారులు సంప్రదాయ నృత్యాలు, హారతులతో ఆహ్వానించారు. పర్యటనలో భాగంగా మోదీ స్వీడన్ ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతికత, రక్షణ రంగాల్లో సహకారంపై భేటీ కానున్నారు. గ్రీన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్‌లు, స్పేస్, క్లైమేట్ యాక్షన్ వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. 2025 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 7.75 బిలియన్ డాలర్లకు చేరింది. ఆ మొత్తాన్ని మరింత పెంచే విధంగా ఇరు దేశాధినేతలు పరస్పర ఒప్పందాలు చేసుకోనున్నారు.
రేపు, ఎల్లుండి నార్వేలో పర్యటన
స్వీడన్ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ మే సోమ, మంగళవారాల్లో నార్వేలో పర్యటించనున్నారు. తొలిరోజు రాజధాని ఓస్లోకు చేరుకోనున్నారు. రెండో రోజు ఓస్లోలో జరిగే ‘3వ ఇండియా-నార్డిక్ సమ్మిట్’లో పాల్గొంటారు. ఇదే రోజు ఆ దేశ ప్రధాని జోనాస్ గహర్ స్టోర్‌తోనూ ద్వైపాక్షిక చర్చలూ జరుపుతారు. ఒక భారత ప్రధాని 43 ఏళ్ల తర్వాత నార్వేలో పర్యటించడం ఇదే తొలిసారి. గ్రీన్ టెక్నాలజీ, క్లీన్-టెక్ ఇన్నోవేషన్, రోబోటిక్స్ రంగాల్లో సహాయ సహకారాలపై చర్చలు జరుగనున్నాయి. మోదీ తాజా పర్యటనతో భారత్‌ను అంతర్జాతీయ సమాజం ప్రపంచ టాలెంట్ హబ్‌గా స్టార్టప్ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.






