బైక్ దొంగతనాల కేసు ఛేదించిన పోలీసులు
ఇద్దరు అరెస్ట్, ఆరు బైక్లు స్వాధీనం
మొయినాబాద్, మే 3 (విజయ క్రాంతి):: మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ నెలలో చోటుచేసుకున్న బైక్ దొంగతనాల కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. మే 2న గస్తీ నిర్వహిస్తున్న క్రైమ్ టీమ్, మొయినాబాద్‌సురంగల్ బైపాస్ వద్ద నెంబర్ ప్లేట్ లేని యమాహా బ్పై అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారు హరిజన రామకృష్ణ (20), బద్దుల విజయ్ కుమార్ (22)గా గుర్తించారు. విచారణలో వీరు గత ఏప్రిల్లో మొయినాబాద్లో 4, చేవెళ్లలో 1, కూకట్పల్లి పరిధిలో 1 బైక్ చోరీ చేసినట్లు అంగీకరించారు. మొత్తం ఆరు బైక్లను వారి నివాసాల వద్ద దాచిపెట్టగా, పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను మే 3న అరెస్ట్ చేసి రాజేంద్రనగర్ కోర్టులో రిమాండ్కు హాజరుపరిచారు. ఈ కేసులను ఛేదించిన మొయినాబాద్ ఎస్హెచ్‌ఓ వై. మల్లికార్జున్ రెడ్డి, క్రైమ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ ఉపేందర్, డీఎస్‌ఐ సుభాష్ మరియు వారి బృందాన్ని చేవెళ్ల జోన్ డీసీపీ యోగేష్ గౌతమ్, ఏసీపీ బి. కిషన్ అభినందించారు. ప్రజలకు సూచనలు: ఫ్యూచర్ సిటీ పోలీసులు ప్రజలకు సూచిస్తూ, ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాహనాలకు తాళాలు వేసి భద్రంగా ఉంచాలని, జీపీఎస్ వ్యవస్థను వినియోగించాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయాలని కోరారు.






