పెద్ద అంబర్ పేటలో పోలీసుల కాల్పులు
హైదరాబాద్: పెద్ద అంబర్ పేట్ సమీపంలో పోలీసులు కలకలం రేగింది. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నల్గొండ సీసీఎస్ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇటీవల జాతీయరహదారిపై పార్కింగ్ వాహనాలే లక్ష్యంగా వరస చోరీలు జరుగుతున్నాయి. వరస చోరీలతో అప్రమత్తమై నల్గొండ పోలీసులు నిఘా పెట్టారు. నల్గొండ ఎస్పీ శరత్ చంద్రపవార్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున సంచరిస్తున్న దొంగల ముఠాను గుర్తించిన పెట్రోలింగ్ పోలీసులు వారిని పట్టుకునేందుకు వెంబడించారు. రాచకొండ పరిధిలోకి వచ్చాక ఇక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. రాచకొండ, నల్గొండ పోలీసుల సంయుక్తంగా పట్టుకునేందుకు ప్రయత్నించారు. దొంగలను పట్టుకునే క్రమంలో పోలీసులపై కత్తులతో ఎదురుదాడి చేశారు. దీంతో గాల్లోకి కాల్పులు జరిపి ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఇద్దరు దొంగలను సీసీఎస్ పోలీసులు నల్గొండకు తరలించారు,






