20 June, 2026 | 2:56 AM

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

20-06-2026 01:52 AM

ఎర్రవల్లి జూన్ 19:  జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వావిలాల గ్రామ శివారులో నిర్వహిస్తున్న అక్రమ పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఇటిక్యాల ఎస్త్స్ర కే. రవి తెలిపిన వివరాల ప్రకారం,విశ్వాసనియా సమాచారం మేరకు పోలీసులు దాడి చేయగా అక్కడ పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి రూ. 12,440 నగదు, 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్త్స్ర తెలిపారు. అక్రమ జూద కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.