20 June, 2026 | 2:56 AM

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

20-06-2026 01:53 AM

అదనపు కలెక్టర్ యువరాజ్ మార్మాట్

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 19(విజయ క్రాంతి): కాగజ్నగర్ మున్సిపాలిటీలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మార్మట్ శుక్రవారం సమీక్షించారు. మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణ, పన్నుల వసూళ్లు, ప్రజా సేవల అమలు తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ షహీన్ సుల్తానా, వార్డు కౌన్సిలర్లతో సమావేశమై అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. పట్టణాభివృద్ధి లక్ష్యాల సాధనలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.అనంతరం ఎల్లగౌడ్ తోట పార్క్ను సందర్శించిన ఆయన అక్కడ చేపట్టిన అభివృద్ధి పనులు, పరిశుభ్రత, పచ్చదనం, సందర్శకులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. పార్కు నిర్వహణను మరింత మెరుగుపరచడంతో పాటు పచ్చదన పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎ.బి. రామాదేవి, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎం. శంకర్, పర్యావరణ ఇంజనీర్ డి. ప్రణీల్ కుమార్, ఇతర అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.