7 April, 2026 | 6:29 PM

గిరిజన గ్రామంలో పోలీసుల గ్రామోత్సవం నిర్వహణ

07-04-2026 04:37 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): జిల్లా ఎస్పీ  రోహిత్ రాజ్ ఆదేశంతో  ఇల్లెందు డీఎస్పీ వెంకన్న బాబు ఆధ్వర్యంలో టేకులపల్లి మండలం చింతోనిచెల్లక గ్రామ పంచాయతీలోనీ  నాగారం గుత్తి కోయ గిరిజన గ్రామంలో మంగళవారం పోలీసులు గ్రామ సభ నిర్వహించారు. ఆ గ్రామానికి చెందిన మాధవి, సునీత, కుంజా లక్ష్మీలను సన్మానించారు.

ఈ సందర్భంగా  డీఎస్పీ వెంకన్న బాబు మాట్లాడుతూ.. యువకులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయి కీ ఎదగాలీ అని చెడు మార్గాలలో వెళ్లకూడదన్నారు. గ్రామాలలో ఉద్యోగం పొందిన వారిని, మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై, ట్రాఫిక్ రూల్స్ పై, మాదక ద్రవ్యాల పై అవగాహన కల్పించారు.