8 June, 2026 | 1:45 AM

ఆసక్తికరంగా ‘పొలిమేర దాటే వేళ’

08-06-2026 12:00 AM

పొలిమేర దాటిన వేళ ఏమవుతుంది? కొత్త జీవితం ప్రారంభం అవుతుంది. పాత జీవితంలో ఎదురయ్యే వ్యక్తులు- తండ్రి కావొచ్చు. కొడుకు కావొచ్చు. కోడలు కూతురు బంధువులు - ఎవరైనా కావొచ్చు? మారిపోతారు. ఉంటు న్న, ఉండాల్సిన నేలా గాలి, ఇళ్లూ వాకిలి మారిపోతుంది. కొత్త గాలి, మనుషులు, వా టి పరిమళాలు పాతవాటి స్థానంలో ప్రవేశిస్తాయి, అవి మంచికా? చెడుకా? అన్న ప్రశ్న అప్రస్తుతం. విశ్వవ్యాప్తంగా రెండే రెండు కులాలు. ఉన్నావారు.

లేనివారు. లేనివారు అనునిత్యం పొలిమేరలు దాటి ఉన్నవారి వైపు ప్రయాణం సాగిస్తూ ఉంటారు . పరాన్నజీవులల్లె బతుకుతూ ఉన్నవారు. వీరు పొలిమేరలు దాటనీయకుండా కాపలా ఉం టారు. కథకుడు పర్కపెల్లి యాదగిరి తమ ‘పొలమేర దాటే వేళ’ కథా సంపుటి లో ఇదే చెబుతున్నారు. పూలకు పరిమళం తోడైనట్లు, కథకు మంచి కథనం జోడించారు. అందునా, తెలంగాణ యాస ప్రతి కథలో నూ పరిమళించింది. మరో విశేషం ఏమిటం టే సంపుటిలో ఉన్న ౧౨ కథలూ, వివిధ సం స్థలు నిర్వహించిన పోటీల్లో బహుమతి పొం దినవే. ౨౦౧౪ నుంచి ౨౦౨౦ వరకు ప్రచురితమై ప్రశంసలు పొందినవే.

తెలంగాణ ఏర్ప డినాక , తెలంగాణ  సోయి పెరిగింది. ౬౦ ఏళ్ల నుంచి అణచి పెట్టబడి, అసలు తెలంగాణ మాండలికం సాహిత్యానికి అనర్హమన్న అపప్రద నుంచి రచయితలు బయట పడుతున్నారు. దీనికి తోడు ప్రచురణకర్తలు కూడా మాండలికాన్ని ఆదరిస్తున్నారు. తెలు గు సాహిత్యానికి మంచి కథల చేర్పు చోటుచేసుకుంటున్నది. తెలిదేవర భానుమూర్తి వంటి తెలంగాణేతరులు కూడా ఆదరిస్తుంచారు. సాహిత్యం విశ్వజనీనం. కథా, కథనం ఈ రెండూ బావుంటే ఆదరణకు లోటు అన్న ది లేదని యాదగిరి కథలు నిరూపిస్తాయి.

ఆత్మాభిమానము కలగలిసి

స్థాలీపులాక న్యాయంగా కొన్ని కథలను తీసుకుందాం. సంపుటికి టైటిల్‌గా వచ్చిన కథ ‘పొలిమేర దాటే వేళ’లో రాఘవ, వసం త దంపతులు నేటి తరం మనుషులు. వారికి ఇద్దరు సంతానం. వారి కుటుంబం రెక్కలు ముక్కలు చేసుకొని కరువులు కాటకాలు, కష్టాలు ఎన్ని వచ్చినా తండ్రి భూమి అమ్మలేదు. రాఘవ ఇల్లు కొనుక్కోవటానికి తండ్రి, ఇల్లూ పొలం అమ్మేసి కొడుకు దగ్గర ఉండా ల్సి వచ్చింది. కొడుకు తటస్థుడే కానీ, కోడలు నోటిదురుసు మనిషి.

తన ఇల్లూ పిల్లలు తప్ప మరో ధ్యాస లేనిది. ఈ క్రమంలో ‘మామ బరువవుతాడు’  ఆనేది ఆమె ఆలోచన. అది గ్రహించిన రాఘవ తండ్రి తన కాళ్ల మీద తాను బతుకుదామని ఎక్కడికో వెళ్లిపోతాడు. తండ్రి కోసం వెతుకుతున్న రాఘవకు, తండ్రి ఆత్మాభిమానము భూతదయ, పార్కులో పల్లీలమ్ము కొనే మరో ముసలమ్మ ద్వారా తెలుస్తుంది. ఆడిన రెక్కా, తిరిగిన కాలు..పనీ పాటూ లేకుంటే అంత కట్టేసినట్లున్నది.

ఏ గుడికాడనన్నా, ఇన్ని పూల దండలు కొబ్బరికాయలు అమ్ముకుం టా. కొడుకూ కోడలు మీద గిప్పుడే ఎందుకు ఇరుగబడాలే.. ఏటన్నా కానరాని దేశంబోత.. కొడుకు కోడలు ఇద్దరు పిల్లలు.. అందర్నీ కండ్లతోటి జూస్కుంట బత్కాలని జీవి మత్తు తండ్లాడుతాంది.. ఆన్ని మనం అనుకున్నట్టు ఐతయా... అన్న తండ్రి ఆవేదనా.. కోడలి గడుసుదనం, కొడుకు నిస్సహాయతనీ గొప్పగా చిత్రకరించబడిన కథ ఇది. పల్లీల ముసలవ్వ ముసలి కుక్క ద్వారా చేసిన ‘గీతోపదేశం’ రాఘవకే  కాదు.. మానవత్వం ఉన్న మన అందరికీ కనువిప్పు.

ప్రజా సంక్షేమాన్ని ఆశించి ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవే శ పెడుతుంటాయి,  అవి ఆశించిన వారికి అందకుండా, మరెవరో దక్కించుకుని ప్ర యోజనం పొందుతుంటారు. అలాంటి అసమాజికమైన చర్యలవల్ల,నిజాయితీలేని తం డ్రి వలన సంతానం ఎంతటి హేళనకు గురి అవుతారో ‘గురుసాకాత్’ కథలో బడిపిల్లవాడు హిమాంశు ద్వారా చెపుతాడు రచయి త. న్యాయంగా అందాల్సిన వారికే చెందాలన్న సందేశం ఎంతో ఉదాత్తమైనది. 

ఆర్ద్రత నిండిన పాత్రలు

‘మంచికి పోతే చెడు అవుతుందా?’ అవ్వొచ్చును..అంటాడు కథకుడు యాదగిరి ‘పాకు రు బాట’లో అదెలాగో ఈ కథ చదివి పాఠకులు తెలుసుకోవాల్సిందే.. ఈ కథలో ప్రధా న పాత్ర తమ్ముడు ధర్మయ్య. అన్న కాలం చేస్తే, ఏడాదిలోపు ఆతని కూతురు పెళ్లి చేస్తే పుణ్యం అని ధర్మయ్య పెళ్లి పెట్టుకుంటాడు. అప్పు పుట్టవలసిన చోట డబ్బు రాదు. క ట్నం ఇవ్వకుండా.. కూతురు లగ్గం చేయలేని గడ్డు స్థితి ఎదురవుతుంది. దారి తోచదు. ఆత్మహత్య తప్ప మరో మార్గం కనిపించదు ధర్మయ్యకు.

ఈ విషయం బస్సు ప్రయాణం లో పరిచయమైన తోటి ప్రయాణికుడికి తెలుస్తుంది. అతడికి డబ్బు సహాయం చే యాలనుకుంటాడు. అదీ ఆలస్యం అవుతుం ది. ధర్మయ్య ఆత్మహత్య చేసుకుంటాడు. ‘పాకురు బాట’ మీద నడిచినందుకు ధర్మ య్యకు అన్యాయం జరుగకుండా రచయిత కథను మరోలా మలిస్తే బావుండేది. చచ్చి ఏదీ సాధించలేము. అందునా బలవన్మరణం. తప్పుడు సంకేతం ఇస్తుంది.. ఊర పిచ్చుకల మీద ప్రేమతో ఎండాకాలంలో వాటి కోసం నీళ్లు ఏర్పాటు చేస్తుంది ముసలి నర్సవ్వ.

తాను ఉంటున్నది కిరాయి ఇళ్లు కావడం మూలాన. ఇంటి యజమానికి, మిగ తా అద్దెకున్న వారికి ఇది నచ్చదు. కఠిన మనుషులు. ఇల్లు ఖాళీ చేయమంటారు. ఇల్లు ఖాళీ కాదు, ఏకంగా లోకాన్నే ఖాళీ చేసి వెళ్లింది నర్సవ్వ. నోరులేని జీవుల మీద కొంత దయ చూపించాలి.. మనుషులమైన మనం అన్నదే ఆమె తత్వం.. ఆమె ఆరాటానికి పరిష్కారం చూపిన రచయిత ఆమె మరణంతో కథ ముగించటం కంటే మరోలా చెబితే బాగుండేదేమో!

మాండలికపు సువాసనలు

బలవంతమైన సర్పం. చలిచీమల చేత చిక్కి చస్తుంది. పిడికెడంత లేని కుందేలు.. అడవికి రాజైన సింహాన్నే చంపగలిగింది. తన బుద్ధిబలం వలననే అది సాధ్యపడింది. సాధారణ పౌరుడైన రాయమల్లుకు ఒకే ఒక్క ఆధారమైన మనవడు మంత్రిగారి కాన్వాయ్ వాహనం ఢీ కొని చనిపోతాడు. రాయమల్లు నాలుగు చక్రాల బండిని నెట్టుకుంటూ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన మంత్రిగారి కాన్వాయ్, రాయమల్లుని తప్పించబోయి చెట్టుకు గుద్దుకుని మంత్రి చనిపోతాడు. ఇది యాదృచ్ఛికమో రాయమల్లు కావాలనే చేశా డో అర్థం కాదు. మొత్తానికి ఉపాయం ఉంటే ఊళ్లు ఏలగలమనే సామెత చీమలు కథకు బలం చేకూర్చుతుంది. కన్నవారి మీది ప్రేమ.

శ్రమ సౌందర్యం (పొలిమేరదాటే వేళ), ప్రభుత్వ పథకాల దుర్వినియోగం (గురుసాక్షాత్), మంచితనం మానవత్వం (పాకురు బాట), పర్యావరణం, ప్రేమ (గూడు) మీద మంచితనం మీద ప్రేమ ఉండాలని బోధించే కథలు. కథలన్నింటా తెలంగాణ జాతీయాలు, సామెతలు -రెక్కల్ల బొక్క ల పెంచుకోవటం, గజ్జి లెక్కదాపురమవటం, పట్టున పలగటం, ఇరుగబడటం, రోగం వచ్చిన కోడి పెట్టలెక్క కళ్లు వస్తూ తెరవటం, తుఫానులో చిక్కుకున్న నావలా కుదుపులు, రేకుల మీద కురుస్తున్న రాళ్లవాన ఆగి పోయినట్లు, సర్కారు జుట్టు పబ్బిలీకు షేతులు న్నది, నీ తాగుబోతు మొకం ఆగడిబోను, ఇజ్జతికి ఉరిపెట్టుకొని సచ్చుడే, రువ్వడి మీద బండి తాకిచ్చి దంచుకపోవటం, యాడాది మాష్కం లోపల లగ్గం జేత్తే పున్నెం లాంటి అచ్చ తెలంగాణ పదాలతో కథకు పన్ని వేశాలకు ప్రాణం పోశారు రచయిత. కథకుడు యాదగిరికి అభినందనలు.

కూర చిదంబరం

వ్యాసకర్త సెల్: 86393 38675