8 June, 2026 | 1:45 AM

కొన్ని జ్ఞాపకాలు

08-06-2026 12:00 AM

కొన్నిసార్లు అంతే.. 

తలలో కలలు 

వద్దన్నా తరుముతుంటాయి

కోరికలు గుర్రాలై 

రాత్రిని నిద్రను 

అపహరిస్తాయి..

మిగిలిన జ్ఞాపకాలు 

పగిలిన పెంకులను 

పేరు పేరునా పలకరిస్తూ

జారిపోతున్న కాలాన్ని కాస్త ఆగమంటాయి 

వెన్నక్కి రమ్మని కాళ్లు పట్టుకొని 

కన్నీళ్లు కార్చి వేడుకున్నా 

దొంగిలించిన నా కలలను

ఎత్తుకుపోయిన నా ఆనవాళ్లను 

పారేసుకున్న నా ఉనికిని వెతికి తీసుకుని

రమ్మని నాకిమ్మని 

ఆశగా అర్థిస్తున్నా !

 శ్రిష్టి శేషగిరి