calender_icon.png 5 February, 2026 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

05-02-2026 03:51:50 PM

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హరిత పేర్కొన్నారు.గురువారం జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు ఆలోక్ కుమార్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, శిక్షణ ఐఏఎస్ అధికారి భార్గవ్ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.

మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరుగుతాయని, పోలింగ్ ప్రక్రియలో వినియోగించే ప్రతి పత్రంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పీఓ డైరీలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నమోదు చేయాలని, ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతాన్ని జోనల్ అధికారులకు అందించాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియలో వినియోగించే సామగ్రిని, బ్యాలెట్ పత్రాలను ముందుగానే సరిచూసుకోవాలన్నారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించేలా ఇతర పోలింగ్ సిబ్బందితో సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎక్కడా ఉల్లంఘించకూడదని, ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.