జీవో 97ను రద్దు చేయాల్సిందే

11-09-2026 | 05:00am
  1. కాలేజీలను ‘శక్తి’ పరిధిలోకి తేవొద్దు
  2. రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల డిమాండ్
  3. రోడ్డు మీదకు చేరి ఆందోళన
  4. అడ్డుకున్న పోలీసులు.. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట 
  5. ఈస్ట్ మారేడుపల్లిలోనూ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ధర్నా 

ఉప్పల్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): జీవో 97ను రద్దు చేయడంతో పాటు పాలిటెక్నిక్ కళాశాలల(Polytechnic colleges)ను ‘శక్తి’ విభాగం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ(Young India Skill University) పరిధిలోకి తీసుకురావొద్దని డిమాండ్ చేస్తూ హైదరాబాద్Hyderabad) రామంతాపూర్(Ramanthapur) ప్రభుత్వ పాలిటెక్నిక్(Government Polytechnic) విద్యార్థులు(Students) చేపట్టిన ఆందోళన గురువారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గత 20 రోజులకు పైగా తరగతులను బహిష్కరిస్తూ నిరసన తెలుపుతున్న విద్యార్థులు(Students) గురువారం క ళాశాల నుంచి బయటకు వచ్చి ప్రధాన రహదారి దిగ్బంధనానికి యత్నించారు.

ముందస్తు సమాచారంతో చేరుకున్న పోలీసులు(Police) కళాశాల గేట్లను మూసివేసి అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టు తెలిసింది. ప్ర భుత్వం వెంటనే జీవో 97 పై స్పష్టమైన ప్రకటన చేసి, దానిని రద్దు చేయకపోతే రాష్ట్రవ్యా ప్తంగా నిరసనలను ఉధృతం చేస్తామని వి ద్యార్థులు హెచ్చరించారు.

సికింద్రాబాద్‌లో ని ఈస్ట్‌మారేడుపల్లిలోనూ పాలిటెక్నిక్ స్టూ డెంట్స్ ధర్నా చేశారు. కాగా జీవో 97 వల్ల సాంకేతిక విద్య మండలి స్వయంప్రతిపత్తి దెబ్బతిని, బీటెక్ ప్రవేశాల కోసం రాసే ఈసెట్ విధానం రద్దవుతుందేమోనని విద్యార్థులు భయపడుతున్నారు. స్కిల్ యూనివ ర్సిటీ పీపీపీ నమూనాలో పనిచేయడం వల్ల ప్రైవేటీకరణ జరిగి ఫీజులు పెరుగుతాయని ఆరోపిస్తున్నారు. ఈ ఉద్యమానికి పలు వి ద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. 

విద్యార్థులపై లాఠీచార్జ్ తగదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు(Ramchander Rao)

తమ భవిష్యత్తును కాపాడుకునేందుకు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో లాఠీచార్జ్ చేయించిందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు(Ramchander Rao) పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో తమ హక్కుల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు విచక్షణ లేకుండా తోసివేస్తూ లాఠీలతో దాడికి పాల్పడటం దారుణమన్నారు. విద్యార్థి లోకం గొంతు నొక్కేలా నిరంకుశంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.

విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేసేలా అనాలోచితంగా జీవో 97ను తీసుకురావడం సిగ్గుచేటన్నారు. డిప్లొమా విద్యార్థుల ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసే ఈ వివాదాస్పద జీవోను రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు రోడ్డెక్కితే, వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాల్సింది పోయి పోలీసులతో అణచివేయాలని చూడటం దుర్మార్గమన్నారు. కళాశాల ప్రాంగణాన్ని ఒక యుద్ధక్షేత్రంలా మార్చి విద్యార్థులను కిందపడేసి గాయపరచడం ప్రభుత్వ అహంకారానికి పరాకాష్ట అని ఫైర్ అయ్యారు. 

మరిన్ని వార్తలు