17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి

02-02-2026 09:16 PM

ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ 

నోడల్ అధికారులకు పలు సూచనలు

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సర్వీస్ ఓటర్లు, పీడీ  ఓటర్లు, పోలింగ్ రోజు విధులు నిర్వహించే సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిరిసిల్ల, వేములవాడలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి  గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ పై అధికారులకు శిక్షణ ఇచ్చారు. 

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం పోస్టల్ బ్యాలెట్ పై ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఎన్నికల అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ ఎవరికి ఇవ్వచు.. దానికి ఏ ఏ ఫామ్ లు ఇవ్వాలి.. మున్సిపాలిటీల్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్, సిబ్బంది, పోలీసుల పహరా తదితర అంశాలపై సూచనలు చేశారు.

అనంతరం ఎన్నికల కౌంటింగ్ అధికారులు, సిబ్బందికి సంబంధించి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. పోలింగ్, కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు, శిక్షణ తదితర అంశాలపై ఎన్నికల నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లకు ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నోడల్ అధికారులు శ్రీనివాసాచారి, లక్ష్మీరాజం, జగన్ మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.