ప్రభుత్వ విప్ వాహనంలో పేలిన పవర్ బ్యాంక్

17-09-2026 | 11:51am

తృటిలో తప్పిన పెను ప్రమాదం 

మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్(Jatoth Ramachandru Naik) ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణలో పాల్గొనేందుకు వెళుతుండగా కురవి మండలం చింతపల్లి వద్ద ఆయన కారులో సెల్ఫోన్ పవర్ బ్యాంకు పేలుడు సంభవించింది. ఈ సంఘటన చూసిన వెంటనే అప్రమత్తమైన భద్రత సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. దీనితో పెను ప్రమాదం తప్పిపోయింది. డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన అనంతరం ఆవాహనాన్ని అక్కడ వదిలి మరో వాహనంలో ప్రభుత్వ విప్ జాతీయ పతాకావిష్కరణ చేసేందుకు మహబూబాబాద్ కు వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు