వార్తా చిత్రాలకు భావోద్వేగాలను రేకెత్తించే శక్తి
రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 19 (విజయక్రాంతి): వార్తలకు సంబంధించిన చిత్రాలకు భావోద్వేగాలను రేకెత్తించే శక్తి ఉంటుందని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత వార్తల చక్రంలో ఫొటో జర్నలిజం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పా రు. 185వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా బషీర్‌బాగ్‌లోని దేశోద్దారక భవన్‌లో రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఫొటో ప్రదర్శన నిర్వహించారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి.. ఈ ప్రదర్శనను ప్రారంభించారు. గడిచిపోయిన ఘటనలకు సజీవ సాక్ష్యంగా వార్తా చిత్రాలు నిలుస్తాయని చెప్పారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. నేటి వార్తా సేకరణలో ఫొటో జర్నలిజం కీలక భూమిక పోషిస్తుందని అన్నారు. ఉత్తమ ఫొటోలకు సంబంధించి ఫొటోగ్రాఫర్లలకు మంత్రి ప్రశంస పత్రాలను అందించారు.






