24 July, 2026 | 7:27 PM

గుండ్లపోచంపల్లి పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

24-07-2026 06:19 PM

33/11 కేవీ సబ్ స్టేషన్ వార్షిక మరమ్మతులు

ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు విద్యుత్ నిలిపివేత

విద్యుత్ రూరల్ ఎఈ కె విజయ్ కుమార్ స్పష్టం

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్ 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో వార్షిక నిర్వహణ పనుల నిమిత్తం శనివారం 27-07-2026 రోజు విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గుండ్లపోచంపల్లి విద్యుత్ శాఖ సహాయ ఇంజనీర్ ఏఈ కే విజయ్ కుమార్ తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మొత్తం 3 గంటలు ​విద్యుత్ అంతరాయం ఏర్పడే ప్రాంతాలు జీపీ పల్లి గ్రామం, బీరప్ప గడ్డ, మైసమ్మగూడ, దూలపల్లి, అయోధ్య ఎక్స్ రోడ్, APIIC, అపెరల్ పార్క్, నైబర్‌హుడ్, అపర్ణ, బెలా విస్టా, ఏజీ సైట్, ఊర్జిత 1,2,3 లక్ష్మీనగర్ ప్రాంతాలు. సంబంధిత విద్యుత్ వినియోగదారులు స్థానికులు ఇలాంటి విషయాన్ని గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని,సిబ్బందికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.అత్యవసర సమాచారం కోసం సహాయ ఇంజనీర్ ఫోన్ నంబర్ 8712472565 లో సంప్రదించవచ్చని తెలిపారు.