24 July, 2026 | 7:19 PM

తల్లి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు

24-07-2026 06:49 PM

మసీద్‌గూడెం గ్రామ సర్పంచ్ మర్రి వంశీదర్ రెడ్డి కుటుంబం

చౌటుప్పల్,(విజయక్రాంతి): మసీద్‌గూడెం గ్రామానికి చెందిన కీ.శే. శ్రీమతి మర్రి సరస్వతి స్మరించుకుంటూ కుమారుడు మసీద్‌గూడెం గ్రామ సర్పంచ్ మర్రి వంశీదర్ రెడ్డి, కుమార్తె కళ్లెం మానస రెడ్డి, అల్లుడు కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.తమ తల్లి చిన్నతనంలో విద్యాభ్యాసం చేసిన నేలపట్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేయడంతో పాటు పాఠశాల అవసరాల కోసం ఒక బీరువాను ఉపాధ్యాయులకు అందజేశారు. అనంతరం పెద్దకొండూర్‌లోని సాయి యాదాద్రి సేవా ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి, ఆశ్రమ వినియోగం కోసం ఒక బీరువాను అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, తల్లిదండ్రుల జ్ఞాపకాలను సమాజ సేవ ద్వారా చిరస్థాయిగా నిలుపుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నిర్వాహకులు పేర్కొన్నారు.