24 July, 2026 | 7:27 PM

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

24-07-2026 06:52 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది.బంజారా గ్రామ బీఆర్ఎస్ పార్టీ  సర్పంచ్ సురేష్ నాయక్,మెల్లకుంట తాండా గ్రామ పంచాయతి బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, అలాగే మెల్లకుంట తాండా గ్రామ పంచాయతి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోహన్ నాయక్ తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్మోహన్రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు,ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరియు రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజాసమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ చేరికతో నాగిరెడ్డిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.